9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ ..! రూ. 20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌

9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ ..! రూ. 20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌

నమస్తే ఫ్రెండ్స్ ..! తెలంగాణ పబ్లిక్ వార్తలు చదువుతున్న వారికీ స్వాగతం ..! SBI Foundation నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 20 లక్ష లు వరుకు ఆర్హిక సహాయం అందించడం జరుగుతుంది పూర్తీ కింద విధానం లో ఉన్నాయి ..!

SBI Platinum Jubilee Asha Scholarship 2026 Application Process : చదువులో ప్రతిభ ఉండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్ (SBI Foundation) గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.‘SBI Platinum Jubilee Asha Scholarship 2026’. పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ఏడాది మొత్తం 25,707 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు SBI Foundation రూ. 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

SBI స్కాలర్‌షిప్ వివరాలు & ప్రయోజనాలు

ఈ పథకం కింద 9వ తరగతి నుంచి విదేశాల్లో చదివే విద్యార్థుల వరకు కోర్సు ఆధారంగా ఆర్థిక సాయం అందుతుంది.

  • కనీస సాయం: రూ. 15,000
  • గరిష్ట సాయం: రూ. 20 లక్షల వరకు (కేటగిరీ/కోర్సును బట్టి)

అర్హత కలిగిన విభాగాలు ( Eligible Categories )

  • స్కూల్ విద్యార్థులు: 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు
  • ఉన్నత విద్య: అండర్ గ్రాడ్యుయేషన్ (UG) & పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
  • వృత్తి విద్యా కోర్సులు: మెడికల్, ఐఐటీ (IIT), ఐఐఎం (IIM)
  • విదేశీ విద్య: విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే భారతీయ విద్యార్థులు
  • ప్రధాన నిబంధనలు (వార్షిక ఆదాయ పరిమితి)
  • స్కూల్ విద్యార్థులకు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.
  • ఉన్నత విద్య కేటగిరీలకు: కుటుంబ వార్షిక ఆదాయం సాధారణంగా రూ. 6 లక్షల లోపు ఉండాలి.
  • గత విద్యార్హతల్లో నిర్దేశించిన కనీస మార్కులు/CGPA సాధించి ఉండాలి.

SBI Foundation

ఎంపిక విధానం

  • Shortlisting: : అకడమిక్ ప్రతిభ (Academic Marks) మరియు కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • Telephonic Interview : షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది.
  • Document Verification : ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేసి, స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

Read More : Police Constable Recruitment 2026 : ఇంటర్ పాస్ అయితే చాలు! తెలంగాణ పోలీస్‌లో 7,112 ఉద్యోగాలు | ₹72,850 జీతం

దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (అధికారిక పోర్టల్ ద్వారా పత్రాలు అప్‌లోడ్ చేయాలి)

    Click here  : SBI Platinum Jubilee Asha Scholarship 2026 Apply Link

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం: జూలై 22, 2026
  • చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2026

గమనిక : అర్హత ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు గడువు ముగిసేలోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని SBI Foundation సూచించింది.