AP లో ఒక్కొక్కరికీ ₹25,000 సహాయం – ఆగస్ట్ 7న డబ్బులు ఖాతాల్లోకి జమ | Netanna Bharosa Scheme Apply Process
Netanna Bharosa Scheme Apply Process : ఆంధ్రప్రదేశ్ చేనేత రంగంలో పనిచేసే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక కొత్త నిర్ణయం తీసుకుంది. ‘Nethanna Bharosa’ scheme కింద, అర్హులైన వారికి సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక సహాయం అందుతుంది. National Handloom Day ఆగస్టు 7న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయడం ద్వారా దీనిని త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు చెందిన, 50 ఏళ్ల లోపు వయస్సు గల చేనేత కార్మికుల కోసం ఉద్దేశించబడింది. గతంలో అనర్హులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని గమనించిన Chief Minister Chandrababu Naidu , కఠినమైన Verification Process ద్వారా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పారదర్శకతను నిర్ధారించడం, అలాగే ప్రయోజనాలు నిజమైన కార్మికులకు చేరేలా చూడటం ప్రభుత్వ లక్ష్యం.

చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, కార్మికుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ సమావేశంలో సవివరంగా చర్చించారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలోనూ, కార్మికుల భవిష్యత్తును సురక్షితం చేయడంలోనూ ఈ చొరవ ఒక మైలురాయిగా నిలుస్తుంది.
AP ప్రభుత్వం ప్రజలు ఇబ్బందులు పాడుకుందా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కి తోడుపడుతూ ప్రజలు జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావని అధికారులు అంచనా వేస్తున్నారు.
గమనిక : ఇలాంటి సమాచారం కోసం telanganapublic.com website ను ఫాలో అవుతున్నానండి ప్రభుత్వ official గా అందించిన సమాచారం ప్రకారం కొత్త update అందించగలము
